కేజీబీవీ ఘటనపై విచారణ
బతుకమ్మ,ఏర్గట్ల: ఏర్గట్ల మండల కేంద్రంలోని కెజీబీవీ స్కూల్లో ఆదివారం 9 వ తరగతి విద్యార్థి కర్రే అంజలి ప్రమాదవశాత్తు రెండవ అంతస్తు నుండి కింద పడిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన కర్రె అంజలి ఏర్గట్ల కేజీబీవీ స్కూల్లో 9వ తరగతి చదువుతుంది. ఇటీవల తన సొంత గ్రామానికి వెళ్లి ఆదివారం అంజలి స్కూల్ కి రావడం, తన దుస్తులను శుభ్రపరచుకొని రెండవ అంతస్తు లో ఆరవేయడానికి వెళ్లిన సందర్భంలో అక్కడే వేచి ఉన్న కోతుల...