24 C
Hyderabad
Sunday, August 2, 2026

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: తనకు ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి హోల్డ్ లో పెట్టారని ఉడుత నవత అనే యువతి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డీఎస్సీ-2024 లో తాను తెలుగు మీడియం ఎస్జీటీ లోకల్ బాడీ కేటగిరిలో 203 ర్యాంకు సాధించగా, 1:1 సెలక్షన్ జాబితా ప్రకారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా అక్టోబర్ 9వ తేదీన ఉపాధ్యాయ నియామకపత్రం అందుకున్నట్లు తెలిపారు. రిపోర్టింగ్ కోసం తానే అదే నెల 11వ తేదీన డీఈవో కార్యాలయానికి రాగా సాంకేతిక కారణాల వల్ల కొందరి ఉద్యోగాలను హోల్డ్ లో పెట్టినట్లు అధికారులు తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రతి రోజూ డీఈవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని, హోల్డ్ లో పెట్టిన వారికి ఈ నెల 8వ తేదీన పోస్టింగ్ ఇచ్చి తన అపాయింట్ మెంట్ ఆర్డర్ ను రద్దు చేశారన్నారు.  స్కూల్ అసిస్టెంట్, ఎస్టీటీ రెండింటికీ ఎస్ రచన అనే అమ్మాయి సెలక్ట్ కాగా, ఆమె ఎస్ఏ పోస్ట్ రద్దు కావడంతో ఎస్జీటీలోకి తిరిగి వచ్చిందని, ఆమె డీఎస్సీ ర్యాంకు 60కాగా, ఓసీ జీ కటాఫ్ ఉన్నది కాస్త 148 ర్యాంకుగా కటాఫ్ కావడం 149 ర్యాంక్ ఓసీ జీ నుంచి బీసీ డీ కెటగిరీలోకి మార్చడంతో బీసీ డీ చివరిలో సెలెక్టైన నీ ఆర్డర్ క్యాన్సిల్ అయినట్లు తనకు తెలిపారన్నారు.

The job was given and canceled

More articles

Latest article