నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: తనకు ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి హోల్డ్ లో పెట్టారని ఉడుత నవత అనే యువతి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డీఎస్సీ-2024 లో తాను తెలుగు మీడియం ఎస్జీటీ లోకల్ బాడీ కేటగిరిలో 203 ర్యాంకు సాధించగా, 1:1 సెలక్షన్ జాబితా ప్రకారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా అక్టోబర్ 9వ తేదీన ఉపాధ్యాయ నియామకపత్రం అందుకున్నట్లు తెలిపారు. రిపోర్టింగ్ కోసం తానే అదే...