- రాజకీయంలో కేటీఆర్ ఓ బచ్చా
- ప్రతిపక్ష నేతగా కేసీఆర్ నే గుర్తిస్తాం
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనుగోలు కేంద్రాలు పరిశీలనను స్వాగతిస్తాం
- ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ
నిజామాబాద్, బతుకమ్మ : రాజకీయాలలో కేటీఆర్ ఓ బచ్చా అని, అతన్ని ఫార్మూలా రేస్ కేసులో ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్లు, భవనాల శాఖ గెస్ట్ హౌజ్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తుంటే ప్రజల నుంచి ఆదరణ వస్తుందని దానిని చూసి ఓర్వలేకనే కేటీఆర్ అవాకులు చెవాకులు పేల్చుతున్నారన్నారు. అసలు కేటీఆర్ ఎవరని ఆయన పార్టీకి లీడర్ కావచ్చు కానీ ప్రతిపక్ష నేత కాదు కదా అని అన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షనేతగా కేసీఆర్ ను మాత్రమే గుర్తిస్తుందని ఆయన బయటకు వచ్చి మాట్లాడిన, సలహాలు ఇచ్చిన స్వీకరిస్తామని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం నుంచి కొనుగోలు కేంద్రాలను పరిశీలన చేయడానికి స్వాగతిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం పై నమ్మకం ఉందని అన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో, నల్గొండ జిల్లాలో ముందస్తుగా అడ్డుకుని అరెస్టు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనుందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనుగోలు కేంద్రం వద్ద ఏమైనా లోటుపాట్లు ఉండే స్థానికంగా ఉండి కలెక్టర్లకు సలహాలు, సూచనలు ఇచ్చి సరి చేయవచ్చని తమకు ఎలాంట అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికే చేస్తున్న సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్లడమే తమ ముందున్న లక్ష్యమని షబ్బీర్ ఆలీ అన్నారు.
