భీమ్‌గల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య , ఉపాధి , కుల, కుటుంబ సర్వే కొరకు వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు అన్ని విధాల సహకరించాలని మండల తహసీల్దార్ మొహమ్మద్ షబ్బీర్,ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ లు కోరారు.శుక్రవారం భీమ్‌గల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే ద్వారా సేకరించిన వివరాలు గోప్యంగా వుంటాయని, ఎవరికీ సమాచారాన్ని వెల్లడి చేయడం జరగదని, అందువల్ల ప్రజలు వివరాలు ఇచ్చే విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్లకు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించాల్సిందిగా కోరారు. తప్పు సమాచారం ఇవ్వకుండా సరైన సమాచారాన్ని ఇస్తే భవిష్యత్తులో ఈ సమాచారం వివిధ సంక్షేమ పథకాలకు ఉపయోగపడేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మండలం పరిధిలో 27 గ్రామ పంచాయితీలో 14238 ఇళ్లు ఉన్నాయని, వాటి సంఖ్య ఇంకా పెరుగచ్చని అన్నారు.125 ఎన్యూమరేషన్ బ్లాక్స్ ఏర్పాటు చేశామని,1 ఎన్యుమెరెటర్ 100 నుండి 200 వరకు ఇళ్లు కేటాయించామని తెలిపారు. ఎన్యుమరెటర్ గ్రామ పంచాయితీ కార్యదర్శిలు , ప్రభుత్వ టీచర్లు , అంగన్వాడీ ఉద్యోగుల ను నియమించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సర్వే కి వచ్చే ఇళ్లకు ఒక రోజు ముందే సమాచారం ఇస్తామని , 75 రకాల ప్రశ్నలు ఉంటాయని, ఇంటి సభ్యుడు చెప్పిందే రాసుకుంటారని, ప్రజలు అందుబాటులో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ , సీనియర్ అసిస్టెంట్ ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు.
