సర్వేకు ప్రజలు సహకరించాలి
భీమ్‌గల్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య , ఉపాధి , కుల, కుటుంబ సర్వే కొరకు వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు అన్ని విధాల సహకరించాలని మండల తహసీల్దార్ మొహమ్మద్ షబ్బీర్,ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ లు కోరారు.శుక్రవారం భీమ్‌గల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే ద్వారా సేకరించిన వివరాలు గోప్యంగా వుంటాయని, ఎవరికీ సమాచారాన్ని వెల్లడి చేయడం జరగదని, అందువల్ల ప్రజలు వివరాలు ఇచ్చే విషయంలో...