29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

పోలీస్ అత్యవసర సేవల ను వినియోగించుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  •  మాచారెడ్డి ఎస్ఐ అనిల్

బతుకమ్మ, మాచారెడ్డి:  అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్లు 100, 108, 1930, 181 ల వినియోగించుకోవాలని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కోరారు. శుక్రవారం మాచారెడ్డి మండలం లోని ఘన్ పూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నేరాల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాబృందం చే షీటీం, సైబర్ క్రైమ్, హెచ్ టీయూ లపై సొంస్కృతిక కళారూపాల ద్వారా వివరించారు. సైబర్ నేరాల పై అప్రమత్తంగా ఉండాలని షీటీం ఫోన్ నెం. 8712686094 ప్రతి మహిళ ఫోన్ లో సేవ్ చేసుకోవాలన్నారు. సైబర్ నేరాల కు గురైన సందర్భంలో టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేసి పోలీస్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ప్రతి మహిళ ఫోన్ లో టీ సేఫ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఇది మహిళలకు చాలా అత్యవసరమైనదని వివరించారు. కార్యక్రమంలో కళాబృందం సభ్యులు ప్రభాకర్, శేషారావు, సాయిలు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article