నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పి.అశోక్ ను ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహా సభల వాల్ పోస్టర్, కరప్రతాలను డీఈఓ అశోక్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేశపురం రమేష్, ప్రధాన కార్యదర్శి మల్లమారి మల్లిఖార్జున్, జిల్లా గౌరవ అధ్యక్షులు జే.గంగయ్య, గౌరవ సలహాదారు, జీహెచ్ఎం ఎస్.లింగన్న, జీహెచ్ఎం కవిత, జీహెచ్ఎం బి.సీతయ్య పాల్గొన్నారు.

