Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 November 2024, 8:43 pm Posted by : ramakrishna

ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో డీఈఓకు సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పి.అశోక్ ను ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.  ఈ సందర్భంగా డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర మహా సభల వాల్ పోస్టర్, కరప్రతాలను డీఈఓ అశోక్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కేశపురం రమేష్, ప్రధాన కార్యదర్శి మల్లమారి మల్లిఖార్జున్, జిల్లా గౌరవ అధ్యక్షులు జే.గంగయ్య, గౌరవ సలహాదారు, జీహెచ్ఎం ఎస్.లింగన్న, జీహెచ్ఎం కవిత, జీహెచ్ఎం బి.సీతయ్య పాల్గొన్నారు.

Honored to DEO under SC and ST teachers association