26.6 C
Hyderabad
Monday, August 3, 2026

మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం

Must read

📰 Generate e-Paper Clip

  • ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

ఎల్లారెడ్డి, బతుకమ్మ : మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు.  జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఐకెపి సదాశివనగర్ మండలం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ఈ క్యాంటీన్ లో అల్పాహారం, భోజనం, పిండి వంటలు,స్నాక్స్, కేటరింగ్ తదితర ఆహారపదార్థాలతో మహిళ స్వయం సహాయ సంఘాల ద్వారా నడపబడుతుంది అని అన్నారు.

Telangana is an ideal for the country in women development

ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం  వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా  తీర్చిదిద్దుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐకేపీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.

Telangana is an ideal for the country in women development

More articles

Latest article