29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎయిడ్స్ నివారణపై అవగాహన పెంచుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ: హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. యూత్ ఫెస్ట్ లో భాగంగా జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవీ, టీబీ, రక్తదానంపై విద్యార్థులకు రెడ్ రన్, క్విజ్, డ్రామా తదితర అంశాల్లో పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే.  విజేతలకు అడిషనల్ కలెక్టర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ ప్రొగ్రాం అధికారి రాధిక, డీపీఎం సుధాకర్, డీఏఏ మహేశ్, సౌత్ క్యాంపస్ ప్రొఫెసర్ అంజయ్య, ఎస్ ఆర్ కే డిగ్రీ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు, టీచర్లు, లెక్చరర్లు పాల్గొన్నారు. 

More articles

Latest article