27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పోలింగ్ 8 గంటలే..

Must read

📰 Generate e-Paper Clip

. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

. పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలు 499.. టీచర్లకు 274 ..

నిజామాబాద్, బతుకమ్మ : కరీంనగర్ – నిజామాబాద్ – మెదక్ – ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గల పోలింగ్ గురువారం జరగనుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం సాయంత్రం 4గంటల వరకు 8గంటల పాటు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. పట్టభద్రుల నియోకజకవర్గంలో 56 మంది, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో 15 మంది బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులతోపాటు స్వతంత్రులు పోటీలో నిలువగా బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంది.  టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థితోపాటు పీఆర్టీయూ, ఎస్టీయూ, టీపీటీఎఫ్, పీఆర్టీయూ తెలంగాణ  తరఫున అభ్యర్థులు పోటీలో  ఉన్నారు. పోలింగ్ కు 48 గంటల ముందు నుంచి ప్రచారాన్ని  నిషేధించారు. అయితే సైలెంట్ ప్రచారం మాత్రం కొనసాగుతోంది. నాలుగు పాత జిల్లాల పరిధిలో ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పట్టభద్రుల నియోజకవర్గంలో 3,55,159 మంది  ఓటర్ల కోసం 499, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం పరిధలో 27,088 మంది ఓటర్ల కోసం 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  పోలింగ్ సిబ్బందికి బుధవారం సామగ్రిని అందజేసి  పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు రవాణా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సకల వసతులు కల్పించారు. అలాగే గురువారం పోలింగ్ ముగిసిన వెంటనే ఆయా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు చేరేలా ఏర్పాట్లు చేశారు.

వచ్చే నెల 3న ఫలితాలు

కరీంనగర్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలిసారి పట్టభద్రుల ఓట్ల కోసం తాయిలాల పంపిణీ జరిగింది. టికెట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అభ్యర్థులు గెలుపు కోసం అదే స్థాయిలో డబ్బులు వెచ్చించడం గమనార్హం. పట్టభద్రుల నియోజకవర్గంలో ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ తరపున కేంద్ర మంత్రులు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ నాయకులు ప్రచారం చేశారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానం కోసం బరిలో నిలిచిన కోటీశ్వరులు కూడా డబ్బులు ఖర్చు చేయడంలో వెనుకడుగు వేయలేదు. ప్రచారం జోరుగా సాగినా తాయిలాల పంపణీ మాత్రం ఓటర్లకు చేరకుండానే మధ్యలోనే మాయం చేశారని పలువురు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల కోసం అభ్యర్థులు చేసిన ఖర్చు విషయంలో ఇప్పటి వరకు కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు కాకపోవడమే విశేషం.

More articles

Latest article