బతుకమ్మ, నాగిరెడ్డిపేట : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలలో మండల కేంద్రం గోపాల్ పేట్ తెలంగాణ ఆదర్శ జూనియర్ కళాశాలలో 79 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆరేటి రాంప్రసాద్ తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలలో 38 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 29 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. అలాగే ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలలో 56 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 50 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 35 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా, 14 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్ తెలిపారు. తెలంగాణ ఆదర్శ కళాశాలలో సప్లిమెంటరీ పరీక్షలలో చిరునులైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు, విద్యార్థులు భవిష్యత్తులో కూడా బాగా చదివి పరీక్షలలో విజయం సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాంప్రసాద్ తెలిపారు.
