తెలంగాణ ఆదర్శ కళాశాలలో 79 మంది విద్యార్థులు ఉత్తీర్ణత
బతుకమ్మ, నాగిరెడ్డిపేట : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలలో మండల కేంద్రం గోపాల్ పేట్ తెలంగాణ ఆదర్శ జూనియర్ కళాశాలలో 79 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆరేటి రాంప్రసాద్ తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలలో 38 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 29 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. అలాగే ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలలో 56 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 50 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో...