24.7 C
Hyderabad
Monday, August 3, 2026

72వ అఖిల భారత సహకార వారోత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

  •  దుర్కి పీఎసిఎస్ లో సహకార పతాక ఆవిష్కరణ

 

బాన్సువాడ, బతుకమ్మ  : కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల పరిధిలోని దుర్కి గ్రామంలోని ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ పీఎసిఎస్ లో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సంవత్సరానికి సహకార వారోత్సవాల ఇతివృత్తం సహకార సంస్థల ద్వారా ఆత్మనిర్భర్ భారత్ గా నిర్ణయించబడింది. ఈ సందర్భంగా పీఎసిఎస్ కార్యాలయంలో సహకార పతాకాన్ని పీఎసిఎస్ చైర్మన్ దివిటి శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పీఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సహకార సంస్థలు గ్రామీణాభివృద్ధికి వెన్నెముక్కల పనిచేస్తాయని, రైతుల ఆర్థిక అభివృద్ధికి పీఎసిఎస్ లు కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో సహకార వ్యవస్థ మరింత బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసిఎస్ డైరెక్టర్లు పి.శ్రీనివాస్, జె.గంగారాం, డి.రాజు, రాములు, పీఎసిఎస్ సెక్రటరీ ఎస్. సుధాకర్ తో పాటు గ్రామప్రజలు, సభ్యులు  ఉన్నారు.

More articles

Latest article