27.5 C
Hyderabad
Friday, July 31, 2026

రైలులో 5.1 కిలోల గంజాయి పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇద్దరు అరెస్ట్

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో 5.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అధికారుల వివరాల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం ఎస్‌హెచ్‌ఓ నిజామాబాద్ బృందం రైలు తనిఖీల్లో భాగంగా సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్‌ ప్రెస్‌లో తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా అక్రమంగా గంజాయిని తరలిస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన అఖిల్ ఆలం, మహమ్మద్ చాంద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం 5.1 కిలోల గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఏ. గంగాధర్, మల్లేష్, ట్రైనీ ఏఈఎస్ గాయత్రి, కానిస్టేబుళ్లు దేవేందర్, శైలేష్, గౌతమ్ పాల్గొన్నారు.

More articles

Latest article