మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 3కే వాక్‌థాన్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ ఆధ్వర్యంలో 3 కే వాక్‌థాన్ నిర్వహించారు. మంగళవారం ఉదయం నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తా నుంచి ఎల్లమ్మ గుట్ట లో మెడికవర్ హాస్పిటల్స్ వరకు ఈ వాక్‌థాన్ కొనసాగింది. వాక్ థాన్ ను మెడికవర్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డా. సందీప్ రావు జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా డా. సందీప్ రావు మాట్లాడుతూ గుండె ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, ప్రతిరోజూ నడక, వ్యాయామం, ఆరోగ్యకరమైన...