24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో 2వ రోజు దీక్ష

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సోమవారం ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత తరువాతనే ఉద్యోగ నియామకాలను చేపట్టాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు 2వ రోజురిలే దీక్ష కొనసాగింది. ఈ దీక్ష కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు,ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి మైలారం బాలు  మాట్లాడుతూ నిండు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు ఇచ్చిన హామీని మరచి గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేయడం మాదిగలను మోసం చేయడమే అని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత నిండు అసెంబ్లీలో వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామకాలు చేపట్టడం మాదిగల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.  మాదిగల మీద కపట ప్రేమ ఆపి తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కు చట్ట భద్దత తెచ్చి మాదిగల పట్ల నిజమైన ప్రేమను చూపాలని మండిపడ్డారు. అన్ని ఉద్యోగాలలో వర్గీకరణ అమలు చేయకుంటే కాంగ్రెస్ పై మాదిగల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మైలారం రాము మాదిగ,మండల ప్రధాన కార్యదర్శి నుతూపల్లి సంతోష్, కోశాధికారి మంగలరం రవి, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఇందారపు రాజు మండల కార్యవర్గ సభ్యులు మంద సంజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article