26.2 C
Hyderabad
Monday, August 3, 2026

టిఫిన్ చేసేందుకు వెళ్లడంతో బస్సులో రూ.23 లక్షలు చోరీ

Must read

📰 Generate e-Paper Clip

నల్గొండ, బతుకమ్మ : నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద రూ.23 లక్షల నగదుతో ఉన్న బ్యాగ్ చోరీకి గురైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ప్రయాణికులు టిఫిన్ చేసేందుకు నార్కెట్ పల్లి సమీపంలో ఆపారు. బస్సులోని ఓ వ్యక్తి నగదు బ్యాగ్ ను అక్కడే ఉంచి టిఫిన్ చేసేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసి సరికి నగదు ఉన్న బ్యాగ్ మాయమైంది. బాధితుడు నార్కెట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article