27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

158 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజులలో 158 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్టు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఆయన అన్నారు. అలాగే ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించిన ఈ తనిఖీలలో మొత్తం 158 కేసుల నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వీరినందర్నీ సంబంధిత కోర్టులలో హాజరుపరచగా వీరికి రూ: 14,50,000/- జరిమానా విధించడం జరిగిందన్నారు. ఇందులో 13 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని తెలిపారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోవాలని ఆయన కోరారు.

More articles

Latest article