26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఎల్లారెడ్డిలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : యెల్లారెడ్డి ఆర్‌డీఓ కార్యాలయంలో వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా యెల్లారెడ్డి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పార్థసింహారెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్య సమరయోధులలో దేశభక్తిని రగిలించిన శక్తివంతమైన గీతమని, ప్రతి భారతీయుడు దానిలోని భావాన్ని గుండెల్లో నాటుకోవాలని పిలుపునిచ్చారు. దేశం కోసం త్యాగం చేసిన మహానుభావులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొని వందేమాతరాన్ని ఆలపించారు. పవహార్ యేశ్వంత్ రావు మాట్లాడుతూ, దేశభక్తి విలువలను యువతలో పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు అత్యంత ప్రేరణాత్మకమని తెలిపారు.

150th anniversary of Vande Mataram celebrated in Yella Reddy

More articles

Latest article