వెబ్ డెస్క్, బతుకమ్మ:
వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన కేసులో పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంకిరెడ్డి భీంరెడ్డి కి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 1న రాష్ట్రంతో పాటు కర్నాటకలలో ఏకకాలంలో డీఎస్పీ భీంరెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని అవినీతి నిరోధక శాఖ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 200 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. డీఎస్పీ స్థాయి అధికారి వద్ద వందల కోట్ల ఆస్తులు బహిర్గతం కావడం అందరికి షాక్ కొట్టినట్లయింది. అదే రోజు భీమ్ రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హజరుపరుచాలి. కానీ భీంరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. దానితో భీంరెడ్డి కోలుకున్న తరువాత సోమవారం రాత్రి ఎసిబి అరెస్టు చేసింది. సంకిరెడ్డి భీమ్ రెడ్డిని అరెస్టు చేయకపోవడంపై ఎసిబి పై విమర్శలు వచ్చాయి. కేవలం పోలీస్ శాఖ కావడం, ఒత్తిళ్ల వల్ల అరెస్టు చేయలేదని అపవాదును ఎసిబి మూటగట్టుకుంది..

