డీఎస్పీ భీం రెడ్డికి 14 రోజుల రిమాండ్

   వెబ్ డెస్క్, బతుకమ్మ: వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన కేసులో పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంకిరెడ్డి భీంరెడ్డి కి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 1న రాష్ట్రంతో పాటు కర్నాటకలలో ఏకకాలంలో డీఎస్పీ భీంరెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని అవినీతి నిరోధక శాఖ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 200 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. డీఎస్పీ స్థాయి అధికారి వద్ద వందల కోట్ల...