29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని 3వ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఎస్సై సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పాములబస్తీ వద్ద గల రైల్వే ట్రాక్ వద్ద శివ తేజ అనే యువకుడు పారిపోతుండగా అతన్ని పట్టుకుని తనిఖీ చేయగా అతని వద్ద సుమారు 110 గ్రాముల గంజాయి లభించింది. మోపాల్ మండలం కంజర్ గ్రామానికి చెందిన బద్నాష్ శివతేజ ప్రస్తుతం గౌతంనగర్ నివాసం ఉంటూ గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు విక్రయాలు జరిపితే సమాచారం ఇవ్వాలని కోరారు.

More articles

Latest article