నిజామామాబాద్ సిటీ, బతుకమ్మ : మద్యం షాప్ ల దరాఖాస్తుల ప్రక్రియ 2025-2027 సంవత్సరానికి మద్యం దుకాణాల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 102 వైన్ షాపులకు గురువారం వరకు 687 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి తెలిపారు. నిజామాబాద్ స్టేషన్ ఫరిది లో మొత్తం 36 వైన్ షాప్లకు గాను 234 దరఖాస్తులు వచ్చాయి. బోధన్ స్టేషన్ పరిధిలో మొత్తం18 వైన్ షాప్లకు 168 దరఖాస్తులు వచ్చాయి. ఆర్మూర్ స్టేషన్ పరిధిలో మొత్తం 25 వైన్ షాప్లకు 135 దరఖాస్తులు వచ్చాయి. భీంగల్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వైన్ షాప్లకు గాను 65 దరఖాస్తులు వచ్చాయి. మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం 11 వైన్ షాప్లకు గాను 85 దరఖాస్తులు వచ్చాయి.
