26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతి పై అత్యాచారం జరుగలేదు : రైల్వే పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : ఎంఎంటీఎస్  ట్రైన్ లో యువతిపై అత్యాచార యత్నం కేసులో సంచలన అంశాలు వెలుగు చూశాయి. ఎంఎంటీఎస్  ట్రైన్ లో యువతి పై అత్యాచారం జరగలేదని రైల్వే పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ట్రైన్ లో నుండి యువతి జారిపడ్డదని తేల్చారు. ట్రైన్ లో నుండి జారీ పడి, తనపై అత్యాచారం జరిగినట్టు యువతి కట్టుకథ అల్లిందని తెలిపారు. యువతి కట్టుకథ తో 100 మంది అనుమానితులను  పోలీసులు విచారించారు. 250 సీసీ కెమెరాలకు జల్లెడ పట్టిన పోలీసులు చివరకు ఏ కోణం లోనూ యువతి పై అత్యాచారం జరిగినట్టు ఆధారాలు లభించలేదని తెలిపారు. చివరకు పోలీసులు విచారణ లో యువతి అసలు విషయం  ఒప్పుకుందని తెలిపారు. రీల్స్ చేస్తున్న సమయంలోనే ట్రైన్ నుండి జారీపడినట్టు  యువతి ఒప్పుకున్నట్లు తెలిపారు. లీగల్ ఒపీనియన్ తీసుకుని కేస్ క్లోజ్ చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

More articles

Latest article