- అక్కను ట్రాప్ చేసి చెల్లిని కూడా తీసుకురావాలని బలవంత పెట్టిన యువకుడు
- ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితురాలు
- రాచకొండ పోలిస్ కమిషనరేట్ ఘట్కేసర్‌లో ఘటన
రాచకొండ, బతుకమ్మ : ప్రేమ పేరుతో మైనర్ ను ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఘట్కేసర్ పోలీసులు అవినాష్ రెడ్డి అనే యువకునిపై కేసు నమోదు చేశారు. అవినాష్ రెడ్డి అనే యువకుడు ఇన్‌స్టాగ్రాంలో పరిచయమై.. ఫొటోలు, వీడియోలు దిగి చివరకు తన ప్రియురాలి చెల్లెలు తనకు కావాలంటూ అక్కను బ్లాక్ మెయిల్ చేశాడు. ఫోటోలు వీడియోలు చూపించి బెదిరింపులకు పాల్పడి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని వస్తే ఫోటోలు, వీడియోలు డిలీట్ చేస్తానని నమ్మ బలికాడు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో బంగారు ఆభరణాలను అక్క తీసుకెళ్లి ఇచ్చింది. ప్రియురాలితో చివరకు చెల్లెను తీసుకరమ్మని చెప్పడంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మైనర్‌ల తండ్రి ఘట్కేసర్ పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
