28.3 C
Hyderabad

భజన పరులకా . . . పనిమంతులకా..?

For the sycophants... or for the capable workers?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సందిగ్ధంలో ఆశావాహులు 

 

. . . 1104 యూనియన్ ఎన్నికల కోలాహలం

 

. . . పోటిదారుల్లోంచి ఒకరు విభజనలో డిచ్ పల్లికి..?

 

నిజామాబాద్, బతుకమ్మ:

 

 నిజామాబాద్ డివిజన్ లో 1104 యూనియన్ ఎన్నికలు ఈ నెల 18న జరగనుండడంతో పోటీలో దిగే అభ్యర్థుల ప్రచారంతో  కోలాహాలం మొదలైంది.  జిల్లా కేంద్రం కావడంతో కార్యవర్గంలో స్థానం కోసం ఉవ్విళ్ళురుతున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, కార్మికుల శ్రేయస్సే ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ గా 1104 అవతరించింది. రెండేళ్ళ కాలపరిమితికి గాను జరిగే ఎన్నికలలో పోటి చేసేందుకు ప్రస్తుతం ఉన్న కార్యవర్గం లోని వారితో పాటు నూతనోత్సాహులు సైతం సమాయత్తం అవుతున్నారు.

. . . భజనపరులకా

విధులకు డుమ్మా కొడుతూ యూనియన్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు  చేసే వారికి  పదవులు కట్టబెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. పొద్దస్తమానం నాయకుల జపం చేస్తూ, భజన కొనసాగించే వారిని,  ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈ సారి ప్రకటిస్తే సంఘ సభ్యుల నుంచి వ్యతిరేక పవనాలు వీచే అవకాశాలు ఉన్నాయనే చర్చ కాంపౌండ్ లో వినిపిస్తోంది.    క్రమశిక్షణ గల యూనియన్ క్రమం తప్పదనే నమ్మకం సంఘ సభ్యులలో ఇమిడికృతమై ఉంది.

. . .  పనిమంతులకా 

ప్రస్తుత కార్యవర్గంలోని  వారికి, భజనపరులకు అవకాశం ఇవ్వకుండా పనిచేసే వారికి నాయకత్వ బాద్యతలను అప్పగించాలనే అభిప్రాయాలు సంఘ సభ్యుల నుంచి వినిపిస్తున్నాయి. స్వలాభం కోసం జపం చేసే వారిని పక్కన పెట్టి, తమ విధులు నిర్వహించుకుంటూ యూనియన్ కోసం పని చేసే వారిని గుర్తించాలనే నినాదం జోరందుకుంది.

 

. . . విభజనలో ఒకరు డిచ్ పల్లికి

కీలకమైన పోస్ట్ కోసం నాయకుడు ప్రతిపాదిస్తున్న ఒకరు విభజనలో భాగంగా డిచ్ పల్లి డివిజన్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. జాబితా ఇటీవలే జారీ కావడంతో దీనినే పోటీదారులతో పాటు, విమర్శకులు ప్రచారాస్త్రంగా వాడుతున్నారు.   ఎన్నికలలో ప్రముఖ స్థానం కోసం  నాయకునికి తాను ముఖ్యుడినని చెప్పుకొని తిరిగే ఆ ఉద్యోగికి విభజన జాబితా కొరకరాని కొయ్యల మారింది.

. . . రేపే ఎన్నికలు

రెండేళ్ల కాలపరిమితికి గాను నిర్వహించాల్సిన ఎన్నికలు ఒకరి పదోన్నతి కోసం వేచి చూడడంతో ఏడాది పొడగింపు జరిగింది. రేపు (18న) జరిగే ఎన్నికలకు ముందుగా యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తుంది. అనంతరం ఎన్నికల ప్రక్రియ కోసం నామినేషన్లు స్వీకరిస్తారు.  ఏకగ్రీవం కోసం భజనపరుల పేర్లను నాయకులు ప్రతిపాదించకుండా, ఎన్నికలను నిర్వహిస్తేనే బలబలాలు తెలిసి వస్తాయనే ప్రతిపాదనలు సంఘ సభ్యులు వినిపిస్తున్నారు.

For the sycophants... or for the capable workers?

 

 

More articles

Latest article