27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సెల్ టవర్ ఎక్కిన యువకుడు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో  పవన్ అనే యువకుడు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని సెల్ టవర్ ఎక్కాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.  టవర్ ఎక్కిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో  పోలీసులు తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని పవన్‌తో ఫోన్ ద్వారా మాట్లాడి, అతడిని  శాంతింపజేసి ప్రాణాలతో కాపాడారు. సుమారు గంటపాటు జరిగిన ప్రయత్నాల అనంతరం పవన్‌ను సురక్షితంగా టవర్‌పై నుంచి కిందికి దించారు.  పవన్‌కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత ఆరు నెలలుగా భార్య కాపురానికి రావడం లేదని, దీంతో  తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యానని పవన్ పోలీసుల ఎదుట తెలిపాడు. జీవితంపై విరక్తి చెంది ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని ఆయన వాపోయాడు. పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించి, పవన్‌కు కౌన్సెలింగ్ అందించడంతో పాటు అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Young man climbing a cell tower

More articles

Latest article