సెల్ టవర్ ఎక్కిన యువకుడు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో పవన్ అనే యువకుడు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని సెల్ టవర్ ఎక్కాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. టవర్ ఎక్కిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని పవన్‌తో ఫోన్ ద్వారా మాట్లాడి, అతడిని శాంతింపజేసి ప్రాణాలతో కాపాడారు. సుమారు గంటపాటు జరిగిన ప్రయత్నాల అనంతరం పవన్‌ను సురక్షితంగా టవర్‌పై...