29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లా అధికారులకు, ఉద్యోగులకు యోగా శిక్షణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  11 వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని  దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా  జిల్లా కలెక్టర్ ఆదేశానసారం జిల్లా సమీకృత కార్యాలయం  ప్రాంగణంలో (జిల్లా కలెక్టరేట్ ) శుక్రవారం జిల్లా అధికారులకు, ఉద్యోగులకు అందరికి యోగ శిక్షణ మరియు  అవగాహన కల్పించడం  జరిగిందని జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జె . గంగదాస్ తెలిపారు .     డాక్టర్ గంగాదాస్ మాట్లాడుతు     ఒక భూమి ఒక ఆరోగ్యము యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ,ఉద్యోగుల మానసిక ఒత్తిడి నివరణకు యోగ చక్కటి మార్గమని వివరించారు. ఈ కార్యక్రమంలో  ముఖ్య అతిథిగా విచ్చేసిన  జిల్లా వైద్యా మరియు ఆరోగ్య  శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ  మాట్లాడుతూ జిల్లాలో 16 ఆయుష్మాన్  ఆరోగ్య  మందిరాలలో ప్రతి రోజు ఉచిత యోగా శిక్షణ పురుషులకు, మహిళలకు ఉదయం సాయంత్రం నేర్పించ బడుతుందని ,  నిత్య జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించి, గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ అవడానికి తోడ్పడుతుందని చెప్పారు . యోగ వైద్యులు డాక్టర్ తిరుపతి యోగ శిక్ష కులచే సామూహిక యోగ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి   ప్రశాంత్,   డిపిమ్ వందన, డాక్టర్ వెంకటేష్,ఆయుష్ పారా మెడికల్ సిబ్బంది పురుషోత్తం, ఉమా ప్రసాద్, స్వాతి, రమేష్, భిక్షపతి , యోగ శిక్షకులు నమ్రత, సంగీత ,  విజయభాస్కర్, రాజేందర్ మరియు అన్ని జిల్లా కార్యాలయాల ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. 21 జూన్ 2025 శని వారం  రోజున జరుపుకోబోవు  11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని  హర్ దిన్ యోగ – హర్ ఘర్ యోగ నినాదం తో ప్రతి ఇంటికి యోగా ని తీసుకెళ్లాలని, ప్రజలు,   విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Yoga training for district officials and employees1524

More articles

Latest article