. . . రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి హెచ్చరిక
నిజామాబాద్, బతుకమ్మ :
పంట చేతికి రాక ముందు ఉన్న ధరను రైతులు పంటను మార్కెట్ కి తెచ్చేసరికి ధరను తగ్గించి ఎర్రజొన్న, పసుపు వ్యాపారులు రైతులను ముంచుతున్నారని వారు తీరుమార్చుకోవాలని రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి హెచ్చరించారు. రైతులను దోచుకొనుడే అలవాటు చేసుకున్న కొందరు వ్యాపారాలు అదే పనిగా పెట్టుకొని దోపిడీ చేస్తున్నారన్నారు. పసుపు కొనుగోలులో బయటి వ్యాపారులు రాకుండా ఇక్కడి వ్యాపారులే సిండికేట్ గా ఏర్పడి 13500 నుండి 15000 వేలు వున్నా ధరను 10 వేల లోపే వచ్చేలా పన్నాగం చేసి రైతులను ఉసురుపోసుకుంటున్నారు. ఇదే పసుపు పక్కన ఉన్న మహారాష్ట్ర లోని సాంగ్లీ మార్కెట్ లో 15 వేల వరకు ధర పలుకుతుంటే ఇక్కడ ఎందుకు తక్కువ ఉంటుందని, ఏదైనా తేడా ఒక వెయ్యి ఉండొచ్చు కానీ ఏకంగా 4 నుండి 5 వేలు తేడా ఉందంటే వ్యాపారుల కుట్రలో భాగమేనన్నారు. పోయిన యాడాది కంటే ఈ యాడాది పసుపు సాగు తగ్గడం తో పాటు దిగుబడి కూడా తగ్గిందని, పసుపు కొనే వ్యాపారాలు తమ విధానాన్ని మార్చుకోవాలని చెబుతున్నారు. ఎర్రజొన్న వ్యాపారులు కూడా 4500 ఉన్నటువంటి ధరను 3700కి తగ్గించి రైతులను నిట్టనిలువునా దోపిడీ చేస్తున్నారన్నారు.నేరుగా అక్కడక్కడా కమిషన్ ఏజెంటులను పెట్టుకొని వారి ద్వారా రైతుల నుండి కొనుగోలు చూపిస్తున్నారని, ఎర్రజొన్న వ్యాపారాలు సిండికేట్ గా ఏర్పడి ధరను పెరగకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. నిజానికి మొక్కజొన్న సాగు ఏరియా పెరిగి ఎర్రజొన్న సాగు ఏరియా తగ్గింది అయినా ధరను పెంచడం లేదని, రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామని తొందరపడి అమ్మకండి మనం తొందరపడితే మన అవసరాన్ని ఆసరా చేసుకొని ధరను తగ్గిస్తున్నారని తెలిపారు. పసుపు ఎర్రజొన్న వ్యాపారాలు తమ పద్ధతి మార్చుకోకపోతే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొనేలా సంబంధిత మంత్రి తో మాట్లాడుతామని హెచ్చరించారు.