27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

దినేష్ కులాచారి జన్మదినం సందర్భంగా పూజలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలోని గుమస్తా కాలనీ దుర్గాదేవి ఆలయం లో ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి జన్మదినం సందర్బంగా ఆలయ అర్చకులు మణికంఠ శర్మ ఆధ్వర్యంలో  బీజేపీ నేతలు అర్చన, పూజ కార్యక్రమాలు  నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆలయ అధ్యక్షులు అమందు విజయ్ కృష్ణ మాట్లాడుతూ చిన్న వయసు నుంచి రాజకీయాల్లో వెలుగు వెలిగి జిల్లా అధ్యక్షులు గా నిత్యం కార్యకర్తలకు అండగా  దినేశ్ ఉంటున్నారని అన్నారు. అమ్మవారి ఆశీస్సుల తో రాబోయే రోజుల్లో దినేశ్  ఉన్నత స్థానం లో ఉండి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి బోడికే బాపూరావు, కోశాధికారి ధాత్రిక వేణుగోపాల్, లవంగ సదా శివ, అనిల్ కుమార్, సంతోష్, హరీష్, మహిళలు భక్తులు పాల్గొన్నారు.

 

 

More articles

Latest article