24.7 C
Hyderabad
Monday, August 3, 2026

పూజలు మన సాంప్రదాయాలకు ప్రతిబింబం

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే మదన్ మోహన్

 

లింగంపేట్, బతుకమ్మ : పూజలు మన సాంప్రదాయాలకు ప్రతిబింబమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. లింగంపేట్ మండలంలోని పరమళ్ళ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ప్రత్యేక అతిథిగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “ పూజలు మన సాంప్రదాయాలకు ప్రతిబింబమని, ఇటువంటి మహోత్సవాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో పరమళ్ళ గ్రామ ప్రజలు  శాంతి, సమృద్ధులతో ఎదగాలని కోరుకుంటున్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, కాంగ్రెస్ గ్రామ కమిటీ సభ్యులు, మహిళా నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Worship is a reflection of our traditions.

More articles

Latest article