26.2 C
Hyderabad
Monday, August 3, 2026

మంత్రి ఉత్తమ్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: భారీ వర్షం, గాలి, మబ్బులు కమ్ముకోవడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హలీకాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తన సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్ లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించేందుకు మంత్రి ఉత్తమ్ బుధవారం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయల్దేరారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో కోదాడలోనే హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ తరువాత మంత్రి రోడ్డు మార్గం ద్వారా హుజర్ నగర్ కు వెళ్లారు.

More articles

Latest article