. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత
నవీపేట్, బతుకమ్మ :
ఉపాధి హామి కూలీలకు ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటి వరకు కూలీ డబ్బులు రాలేదని, వాటిని వెంటనే ఇప్పించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. నవీపేట్ మండల్ దర్యాపూర్ గ్రామంలో ఐద్వా ఆధ్వర్యంలో గురువారం ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సుజాత మాట్లాడుతూ ఉపాధి హామి కూలీలకు కనీసం మౌలిక సదుపాయాలు లేవన్నారు. మంచి నీరు, టెంటు, మెడికల్ కిట్టు వంటి కనీస సదుపాయాలు కూడా లేవని, వీటిని వెంటనే ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ సెక్రటరీ రవీందర్ నాయక్ కి వినతి పత్రం అందించారు. సెక్రటరీ స్పందించి మంచి నీరు, మెడికల్ కిట్టు లు అందుబాటులో ఉంచాలని ఫీల్డ్ అసిస్టెంట్ కి చెప్పామని అన్నారు. కానీ ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం వల్ల కూలీలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి రమాదేవి, కమిటీ సభ్యులు సావిత్రమ్మ స్వరూప, షమీం, వ్యవసాయ కార్మిక సంఘం మండల కన్వీనర్ పి.వసంత్, సిఐటియు జిల్లా నాయకులు నాయక వాడి, శ్రీను పాల్గొన్నారు.

