నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం రైల్వే హాస్పిటల్‌లో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైల్వే హాస్పిటల్ డాక్టర్ పి. విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ గ్రీష్మిక మహిళల ఆరోగ్య సంరక్షణపై పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యత, అలాగే సాధారణంగా ఎదురయ్యే గైనకాలజీ సమస్యలు, వాటి నివారణ గురించి సమగ్రంగా వివరించారు. మహిళలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్యులను సంప్రదించడం అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే హాస్పిటల్ సిబ్బంది, మహిళా ఉద్యోగులు, రోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మహిళల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంలో ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

