మహిళల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం రైల్వే హాస్పిటల్‌లో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైల్వే హాస్పిటల్ డాక్టర్ పి. విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ గ్రీష్మిక మహిళల ఆరోగ్య సంరక్షణపై పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యత, అలాగే సాధారణంగా...