- ఎంపీడీఓ సంతోష్ కుమార్
భీమ్ గల్, బతుకమ్మ : ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటున్న పేద మహిళాలకు ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథం లో స్త్రీనిధి పథకం ద్వారా ఋణ సహాయం అందించడం జరుగుతుందని ఎంపీడీఓ సంతోష్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని మెండోరా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్న ఇద్దరు లబ్ధిదారులకు ఇందిరా క్రాంతి పదం ఆధ్వర్యంలోని స్త్రీ నిధి పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ. 40 వేల చొప్పున ఇద్దరు లబ్ధిదారులకు రూ. 80 వేల ఋణాన్ని ఎంపిడీఓ తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదార్లు ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థిక సాయం కొరకు మీ గ్రామ సీసీలు, వివోలను సంప్రదించి స్త్రీ నిధి కింద లోన్ తీసుకొని నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించుకోవచ్చునన్నారు.ఈ అవకాశన్ని మహిళాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో ఏపీఎం రవీందర్ సీసీలు శ్రీనివాస్, నరేష్,పీ. ఎస్ ప్రశాంత్, వివో అధ్యక్షురాలు హర్షిని, గ్రామ నాయకులు రమేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
