29 C
Hyderabad
Monday, August 3, 2026

ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి లోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో విద్యార్థి, విద్యార్థినిలకు ఉపన్యాస పోటీలు, పాటల పోటీలు, చిత్రలేఖనం, హెయిర్ స్టైల్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులని అందజేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ ఈ లక్ష్మీనారాయణ మహిళా సాధికారత గురించి వివరించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.చంద్రకాంత్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8 న ఎందుకు జరుపుకుంటాము, మొట్ట మొదటి సారి ఎక్కడ జరుపుకున్నారు లాంటి విషయాలు అలాగే ఉమెన్స్ డే ప్రాముఖ్యతను వివరించారు. డబ్ల్యూసి కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్ గోదావరి మహిళల భద్రత గురించి, 112 ఎమర్జెన్సీ నెంబర్ గురించి విద్యార్థినిలతో చర్చించారు. ఐక్యూఎస్ సీ కో ఆర్డినేటర్ బి శంకరయ్య కవిత రూపంలో మహిళల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రకాంత్, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ శంకరయ్య, టిఎస్కేసి కో ఆర్డినేటర్ శివకుమార్, మహిళా సాధికారత విభాగం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎస్ గోదావరి, మహిళా సాధికారత విభాగం సభ్యులు ఎన్.నాగానిక, సూపరిండెంట్ వసంతలక్ష్మి, రాణి, సంగీత, కీర్తి, స్వప్న,  డాక్టర్ గంగారెడ్డి, డాక్టర్ సిద్దురాజ్, కృష్ణ ప్రసాద్, సంతోష్, సురేష్ రెడ్డి, మోయిన్, కిరణ్ కుమార్, మహమూద్, కళాశాల విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Women's Day celebrations held at Yella Reddy Government Degree College

 

More articles

Latest article