ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి లోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో విద్యార్థి, విద్యార్థినిలకు ఉపన్యాస పోటీలు, పాటల పోటీలు, చిత్రలేఖనం, హెయిర్ స్టైల్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులని అందజేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ ఈ లక్ష్మీనారాయణ మహిళా సాధికారత గురించి వివరించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.చంద్రకాంత్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8 న ఎందుకు...