30.9 C
Hyderabad
Monday, August 3, 2026

99 రోజుల కార్యచరణ ప్రణాళికను విజయవంతం చేద్దాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యమ్మ

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 99 రోజుల కార్యచరణ – ప్రణాళిక కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో విజయవంతం చేద్దామని మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యమ్మ పిలుపునిచ్చారు. సోమవారం 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ మీదుగా గాంధీ చౌక్ వరకు 5కే రన్ నిర్వహించగా..ఆమె జెండా ఊపి ప్రారంభించారు.

 

Let's make the 99-day action plan a success

 

అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మున్సిపల్ పరిధిలో సమర్థవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో పర్యావరణ పరిశుభ్రతతో పాటు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కమిషనర్ మహేష్ కుమార్, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, సీఐ రాజిరెడ్డి, ఎంఈఓ రాజులు తదితరులు పాల్గొన్నారు.

 

Let's make the 99-day action plan a success

 

More articles

Latest article