28.2 C
Hyderabad

మహిళలు ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

 

బాన్సువాడ, బతుకమ్మ  : మహిళలు ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆత్మవిశ్వాసంతో ఏ పని తలపెట్టిన మహిళలు విజయం సాధిస్తారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే ఎంతటి లక్ష్యాన్ని అయినా సులువుగా చేరుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆమె తెలిపారు. ఐఏఎస్‌ కావడంలో తన భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉందన్నారు.

More articles

Latest article