- జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి.రాజశ్రీ జిల్లాలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండడమే కాకుండా వారి వ్యక్తిగత ఆరోగ్యం చూసుకోవాలన్నారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మహిళలందరూ రక్తహీనత, థైరాయిడ్, గుండె జబ్బులు, మధుమేహం తో పాటు క్యాన్సర్ ముఖ్యంగా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ కోసం ముందస్తు ఆరోగ్యపరీక్షల్ని చేసుకోవాలని సుచించారు. అదేవిధంగా కుటుంబ బాధ్యతలతో పాటు ఆఫీస్ లో తాను చేసే పనిలో బాధ్యతల్ని నిర్వహించాలన్నారు. అనేక బాధ్యతల కారణంగా మహిళలు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటం చేత స్ట్రెస్ మేనేజ్మె మెంట్ ను పాటించాలని తెలిపారు.
