25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యుత్ షాక్ తో మహిళ మృతి

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి మండలంలోని సాతెల్లి గ్రామానికి ఎరుకల లక్ష్మి(35) అనే మహిళ విద్యుత్ షాక్ తో మృతి చెందింది. లక్ష్మి రేకుల ఇంట్లో నివాసం ఉంటోంది. శుక్రవారం పనిలో ఉన్న ఆమె ఇంటి రేకులను తగలగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. రేకులకు సర్వీస్ వైర్ తగలడంతో విద్యుత్ ప్రవహించి ఈ ఘటన చోటు చేసుకుంది. మృతరాలికి ముగ్గురు పిల్లలున్నారు. పేద కుటుంబం కావడంతో స్థానికులు చందాలు పోగుచేసి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు.

More articles

Latest article