హిమాయత్ నగర్‌లో ఘటన
హైదరాబాద్, బతుకమ్మ : దేవుడి దగ్గరకు వెళ్తున్నానంటూ ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ మృతి చెందింది. హిమాయత్ నగర్‌కు చెందిన అరుణ్ కుమార్ జైన్, పూజా జైన్(43) భార్యాభర్తలు. కొద్దిరోజులుగా ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి శ్రద్ధలతో పూజా జైన్ జీవితం గడుపుతోంది. ఈ క్రమంలో భర్త ఆఫీస్‌కు వెళ్లగా, వారు నివసించే అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి పూజా జైన్ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఆత్మార్పణతో దేవుడికి దగ్గరవుతా అంటూ సూసైడ్ లేఖ లభ్య మైంది.
