హైదరాబాద్, బతుకమ్మ : పోక్సో కేసులో టాలీవుడ్ డాన్స్ మాస్టర్ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. కొరియోగ్రాఫర్ కృష్ణపై గత నెలలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న కృష్ణ మాస్టర్ బెంగళూరులో తలదాచుకుంటున్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యువతులను మోసం చేసినట్లు కృష్ణ మాస్టర్‌పై అభియోగాలు ఉన్నాయి.
