29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

అప్పుల బాధతో ఉరేసుకుని మహిళ ఆత్యహత్య

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: కుటుంబం గడువడానికి పూల  దుకాణం పెట్టగా అప్పులు మిగిలి కష్టాలు రావడంతో మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అదివారం ఉదయం నగరంలోని కోటగల్లిలో జరిగిందని నాల్గవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. నగరంలోని కోటగల్లికి చెందిన మెరిగే కవిత(43) కు  గత కొన్ని రోజుల క్రితం భర్త చనిపోవడంతో కొడుకు , కూతురుతో కలిసి జీవిస్తుంది. ఇటీవల కోడుకు మనోజ్ పూలదుకాణం పెట్టడంతో నష్టాలు వచ్చాయి. దానితో మనోజ్ హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తు కుటుంబానికి చెదోడు వాదోడుగా ఉంటున్న అప్పులు మాత్రం తీరలేదు. ఈ నేపథ్యంలో కవిత అదివారం ఉదయం నగరంలోని కోటగల్లిలోని తన ఇంటిలో ఫ్యాన్ కొండికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Woman commits suicide by hanging herself due to debt

More articles

Latest article