సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ స్టేట్ సెక్రటరేటియట్ మెంబర్ వి. ప్రభాకర్
సిరికొండ, బతుకమ్మ : క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని ఓటమిని ఛాలెంజ్ గా తీసుకొంటే ఎప్పుడు విజయం మనదే అవుతుందని సీపీఐ (ఎం. ఎల్)మాస్ లైన్ స్టేట్ సెక్రటేరియట్ మెంబర్ వి. ప్రభాకర్ అన్నారు.శుక్రవారం మండలంలోని గడ్కోల్ లో సీపీఐ(ఎం.ఎల్ )మాస్ లైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరవీరుల స్మారక క్రీడాల పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణతో డివిజన్ నాయకులు దేవారాం, ముత్తెన్నలతో కలిసి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడాలతో శరీర దారుడ్యాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తాయన్నారు. యువత చదువు, క్రీడాలతో పాటు సామాజిక సేవ దృక్పతం తో పాటు విప్లవొద్యమాల వైపు అడుగులు వేయాలని ఆయన పిలుపు నిచ్చారు. అనంతరం ఈ జిల్లా స్థాయి క్రీడల్లో విజేతలుగా నిలిచిన వాలిబాల్ విన్నర్స్ వాసు అండ్ టీం కొండాపూర్ జట్టుకు మెమంటో తో పాటు నగదు రూ. 10వేలు రన్నర్ పడకల్ శ్రీనివాస్ అండ్ టీం కు మెమోంటో, రూ. 5వేల నగదును, కబడ్డీ విన్నర్స్ ముసిర్ నగర్ జట్టు కు మెమంటో, నగదు రూ. 5వేలు, రన్నర్ చీమన్ పల్లి జట్టు కు రూ. 3వేలు నగదు, మెమంటోలను ప్రత్యేక పథకాలను అందజేసి, అభినందించారు. ఎస్.సురేష్,ఎన్ ఆర్ ఐ లు శ్రీనివాస్, తిరుమల, ఆర్.రమేష్,వి.సత్తేమ్మ, పీఓడబ్ల్యూ నాయకురాలు పి.రమలు, పీడీఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు ఎల్.అనిల్ సీపీఐ (ఎం. ఎల్) మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్.దామోదర్,బి.బాబన్న, జి.సాయరెడ్డి, మండల నాయకులు ఎం.లింబాద్రి,ఈ.రమేష్,బి.కిశోర్, పి.రమ, కె.రాంజీ,ఎస్.కిశోర్, ఎం. డి అనిస్,జె.బాలిరెడ్డి,జి.కిరణ్,జె.ఎర్రన్న, కట్ట. రాములు,ఎం.హరీష్, బి.అక్షయ్,బి.రమేష్,ఎం.ప్రతిప్, కే.వెంకట్ ,బి.లక్ష్మణ్,ఏ.వినోద్,ఎస్ మనిదీప్, పీడీ లు మల్లేష్ గౌడ్, సురేష్, యాదగిరి, నవీన్,పీఈటీ లు జలందర్, శశి, సాయిలు, గంగాధర్, వాసు తదితరులు పాల్గొన్నారు.

