వైన్స్ నిల్.. బెల్ట్  ఫుల్..

0 12,494
  • బెల్ట్ షాపుల్లో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు
  • పట్టించుకోని అధికారులు

 

రుద్రూర్, బతుకమ్మ: మండలంలో మద్యం ఏరులై పారుతోందని అని చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే గల్లీ గల్లీకి ఒక  బెల్ట్ షాపు ఇలా ఎక్కడ చూసినా మద్యం బెల్టు షాపులే దర్శనమిస్తున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అక్బర్ నగర్, రాయకూర్, సులేమాన్ నగర్, అంబం తదితర గ్రామాలల్లో బెల్టు షాపుల్లో అధిక రేట్లకు మద్యం విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులను కొల్లగొడుతున్నారని మద్యం ప్రియులు వాపోతున్నారు. ఏదైనా గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంటు ఉందో లేదో తెలియదు. కానీ బెల్టు షాపులు లేని గ్రామం లేదు. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా షాపుల్లో మాత్రం 24 గంటలు మద్యం అందుబాటులో ఉంటోంది.

  • బెల్ట్ షాపుల్లో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు..

మరో రెండు రోజుల్లో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుండడంతో రుద్రూర్ మండల కేంద్రంలో వైన్స్ షాపుల యజమానులు సైతం స్టాక్‌ మొత్తం ఖాళీ చేసి వైన్స్ బంద్ చేశారు. అయితే బెల్ట్ షాపుల నిర్వాహకులు మాత్రం బోధన్ తో పాటు ఇతర ప్రాంతాల నుండి మద్యం బాటిళ్ళను తీసుకువస్తున్నారు. దీనికి తోడు ఎన్నికలు కలిసి రావడంతో బెల్ట్‌ షాపుల్లో  విచ్చల విడిగా మద్యం అమ్మకాలు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం అయినప్పటికీ సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం సరఫరా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని, బెల్ట్ షాపుల పై ఎక్సైజ్ అధికారులకు ప్రేమేందుకోనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.